16 March, 2026 | 10:31 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలి

14-01-2026 08:39 PM

క్రీడా పోటీలను ప్రారంభించిన డీఎస్పీ

చిట్యాల,(విజయక్రాంతి): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న క్రీడలలో రాణించాలని నల్గొండ డిఎస్పి కే.శివరాం రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు కబడి ఆడి అక్కడ ఉన్న పలువురిని ఆనందపరిచారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దూదపడతాయని యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు నేటి సమాజంలో యువత ఎక్కువగా గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ వంటి దురాలవాట్లకు లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని అన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లo మహేష్, వార్డు మెంబర్ నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, దేశబోయిన లింగస్వామి, సురకంటి మోహన్ రెడ్డి, దేశబోయిన నరసింహ, బొంతల సాయి ప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయికిరణ్, కునూరు గణేష్, శ్రీకాంత్, అరూరి పవన్, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.