calender_icon.png 14 January, 2026 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గుల పోటీల ద్వారా సృజనాత్మకత పెంపొందుతుంది

14-01-2026 08:41:33 PM

చిట్యాల,(విజయక్రాంతి): మహిళలకు నిర్వహించే ముగ్గుల పోటీలు వారిలోని సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా వారిలో ఐక్యతను పెంచుతాయని మాజీ యంయల్సి చెరుపల్లి సీతారాములు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాలలో బుధవారం ఐద్వా, డివైయప్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఆనవాయితిగా సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. పోటీలో గెలుపొందిన మహిళలు, విద్యార్థినీ లకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, బొబ్బలి సుధాకర్ రెడ్డి, మేడి సుగుణమ్మ, సురేష్, దినేష్, శంకరయ్య, హరీష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.