14-01-2026 08:35:33 PM
వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
గరిడేపల్లి,(విజయ క్రాంతి): మండలంలోని కీతవారిగూడెం నందలి శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేష పుష్పాలంకరణ, సహస్రనామార్చన, నవ విధ ఆరతులు, నీరాజన మంత్రపుష్పములు, వంటి పూజా కార్యక్రమంలు ఘనంగా నిర్వహించారు.
మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శన సమయానికి దేవాలయ ప్రాంగణంలో 18 కేజీల కర్పూరంతో మకరజ్యోతిని ప్రజ్వలింపజేశారు. కర్పూర జ్యోతిలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో మకర జ్యోతిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు ముత్తినేని సోమయ్య పాలక కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, అర్చకులు రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, భద్రయ్య శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.