గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్
మర్రిగూడ, డిసెంబర్ 5 (విజయ క్రాంతి) గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. సోమవారం గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు, వి బి కే లు, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, అంగన్వాడి, ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది,వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం, మౌలిక వసతులు, మహిళల ఆర్థిక అభివృద్ధి తోపాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఏ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్న తన దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉప సర్పంచ్ చామకూర కృష్ణమ్మ, వార్డు సభ్యులు దాదె సుమలత, ముద్దం వెంకటయ్య, ఉప్పునూతల అబ్బయ్య, అయితగోని జయమ్మ, వల్లంల యాదయ్య, గుడ్ల రజిత, అందుగుల శ్రీనివాస్, పల్లేటి వెంకటయ్య, ఆకారపు శ్రీను యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.




