06-01-2026 12:00:00 AM
పరిష్కరించాలని అధికారులకు కార్పొరేటర్ వినతి
జూబ్లీహిల్స్, జనవరి 5 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ డివిజనులోని పలు ప్రాంతాల వాసులు సీవరేజీ సమస్యతో పరేషాన్ అవుతు న్నారు. ముఖ్యంగా ఇంద్రానగర్ స్టేజ్ గల్లీ నుంచి పోచమ్మ ఆలయం వరకు, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5, ఫిలింనగర్లోని పద్మాలయ అంబేడ్కర్ నగర్, వినాయకనగర్ ప్రధాన రహదారి ప్రాంతాల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంది. పాత సీవరేజీ లైన్ల కారణంగా స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
దీంతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ సోమవారం జలమండలి అధికారులు ప్రభాకర్ రావు, రాంబాబును కలిసి, సమస్యలను పరిష్కరించాలని సూచించారు. శాశ్వత పరిష్కారం చూపించాలని వినతి పత్రాన్ని అందజేశారు. నూతన సీవరేజీ పైపులైను పనులను వీలైనంత త్వరగా ప్రారం భించాలని అధికారులను కోరారు.