16 April, 2026 | 10:51 AM

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

15-04-2025 12:00 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులి గారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు మనం ఇ చ్చే ఘనమైన నివాళి అని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులి గారి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు సోమవారం ప్రపంచ మేధావి, భార త రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పులిగారి గోవర్ధన్ రెడ్డీ మాట్లాడుతూ  జ్ఞానం మానవ జీవితానికి పునాది అని చాటి చెప్పిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అ యన కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.