పాడేరు 12వ మైలు అందరికీ నచ్చుతుంది
09-03-2025 12:53 AM
సత్యం రాజేశ్, శ్రవ ణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పాడేరు 12వ మై లు’. ఎన్‌కే దర్శకత్వంలో సాయిలక్ష్మీగణపతి మూవీ క్రియేషన్స్ బ్యాన ర్‌పై గ్రంధి త్రినాథ్ నిర్మిస్తున్నారు. సుహాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఎన్‌కే మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు త్రినాథ్ నిర్మాణంలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా.
అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అన్నారు. ‘డైరెక్టర్, యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడం తోనే మా సినిమా కలర్ ఫుల్‌గా వచ్చింది’ అని నిర్మాత త్రినాథ్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు సత్యం రాజేశ్, శ్రవణ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.






