calender_icon.png 25 December, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నీ పంచాయతీలోనే!

25-12-2025 12:00:00 AM

కేసముద్రం, డిసెంబర్ 24 (విజయక్రాంతి): పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రం, క్రీడా ప్రాం గణం ఇవన్నీ ఒకే చోట నిర్వహిస్తూ ఆల్ ఇన్ వన్ పంచాయతీగా చిన్న పంచాయతీ చిన్యా తండా నిలుస్తోంది. 2018లో 500 జనాభా కలిగిన తండాలను అప్పటి ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇందు లో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో చిన్యా తండాను కొత్తగా పంచాయతీ చేసింది.

అయితే కొత్తగా ఏర్పడ్డ పంచాయతీకి ఇప్పటివరకు కార్యాలయం లే దు. దీనితో ప్రాథమిక పాఠశాలలో ఓ గదిలోనే పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అదే పాఠశాల ఆవరణలో అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను మరో గదిలో నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రతి పంచాయతీలో పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. ఇది కూడా పాఠశాల ఆవరణలోనే ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామానికి సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే నిర్వహిస్తూ ఉండడం వల్ల ఆల్ ఇన్ వన్ పంచాయతీగా చిన్యా తండా మారింది. 

దీనితో అటు విద్యార్థుల చదువుకు, ఇటు పంచాయతీ నిర్వహణకు తర చుగా ఇబ్బందిగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్ర భుత్వం స్పందించి పాఠశాల నుండి పంచాయతీని వేరు చేయాలని కోరుతున్నారు.

వేర్వేరుగా వసతి కల్పనకు కృషి చేస్తా

గ్రామపంచాయతీ భవనానికి స్థలం కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా. అంగ న్వాడి కేంద్రానికి కొత్త భవనం నిర్మించడానికి కృషి చేస్తా. క్రీడా ప్రాంగణానికి ప్రత్యేక స్థలం కేటాయించి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనువైన క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగి స్తా. పాఠశాల కేవలం విద్యా బోధనలకు మాత్రమే పరిమితం చేయించే విధంగా చర్యలు తీసుకుంటాను.

జాటోత్ హరిచంద్, సర్పంచ్, చిన్యా తండా