25-12-2025 12:00:00 AM
కంటైనర్ ప్రత్యేక అరలో అమర్చిన గంజాయి ప్యాకెట్లు
ఎనిమిది మందిపై కేసు నమోదు... నలుగురు పరారీ
విలేకర్ల సమావేశంలో వెల్లడించిన పాల్పంచ ఇన్చార్జి డీఎస్సీ అబ్దుల్ రెహ్మాన్
అశ్వారావుపేట,డిసెంబరు 24, (విజయక్రాంతి): అశ్వారావుపేట _ ఖమ్మం జాతీయ రహదారి పై అచ్యుతాపురం క్రాస్ రోడ్డువద్ద బుధవారం ఉదయం ఈగల్ పోర్స్, స్థానిక పోలీసుల తనిఖీలో ఒక కోటి యాభైరెండు లక్షల విలు వైన గంజాయి ప్యాకెట్లు పట్టుకున్నట్టు పాల్వంచ ఇంచార్జ్ డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్‌వెల్లడించారు. దమ్మపేట పోలీస్ స్టేషన్లో సీఐ నాగరాజు , దమ్మపేట ఎస్ ఐసాయి కిషోర్ రెడ్డి,తెలంగాణా ఈగల్ టీమ్ ఆర్ ఎన్ సీ సి ఖమ్మం తో కలసి ఏర్పాటు చేసిన విలేకర్లసమావేశంలో డీఎస్పీ వివరాలను వెలడించారు.
రాజమండ్రి వైపు నుండి సత్తుపల్లివైపుకు గంజాయి ప్యాకెట్లును రవాణా చేస్తున్న టాటామోటారు గూడ్స్ కంటైనర్ దానికి ఎస్కార్ట్ గా వాహనాన్ని ఖమ్మం ఆర్ ఎన్ సీ సీ ఈగల్ ఫోర్స్ టీము సమాచారం మేరకు దాడి చేసి పటుకున్నారు. కంటైనర్ లోప్రత్యేకంగాఏర్పాటు చేసిన అరలో ఒక్కో ప్యాకెట్ 2 కిలోల బరువు తో 304 కిలోల గంజాయిని 152 ప్యాకెట్లను ఉంచి రవాణా చేస్తూ దానికి ఎస్కార్ట్ గా ఉన్న కారునుఅదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన గంజాయి నీఒడిస్సాలోని చిత్రకొండ లోని సాదు గురూజీ వద్ద కొనుగోలు చేసి కారులో రాజమండ్రికి తరలించి ,అక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంటైనర్ లోఅశ్వారావుపేట, సత్తుపల్లి, వి ఎం బంజర్ విజయవాడ మీదుగా చెన్నైలోని విక్రమ్ అనే వ్యక్తికి గంజాయిని తరలిస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తులు తెలిపినట్టు డిఎస్సీ వెలడించారు. ఎస్కార్ట్‌వాహనానికి ఫేక్ నెంబరు ప్లేటును వాడినట్టు తెలిపారు.
గుంజాయితో పాటు కంటైనర్ లోఉన్న ఇద్దరుఎ స్కార్ట్ వాహనంలో మరో ఇద్దరు మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న రూ. 4,500 ను సీజ్ చేసినట్టు తెలిపారు.మరో నలుగరు. వ్యక్తులు పరారీ లో ఉన్నట్టు తెలిపారు. స్థానిక పోలీసులను ఈగల్ టీమ్ ను ఎస్సీ రో హిత్ రాజు అభినందించారు.