calender_icon.png 25 December, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిసా మహోత్సవ క్రీడల్లో కాంస్యం పతకం

25-12-2025 12:00:00 AM

సాధించిన భద్రాచలం ఐటీడీఏ విద్యార్థులు 

భద్రాచలం, డిసెంబర్ 24, (విజయక్రాంతి): భారత మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ విధాన విభాగం న్యూఢిల్లీ కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయస్థాయి పీసా మహోత్సవంలో భద్రాచలం ఐటీడీఏ తరఫున పాల్గొన్న క్రీడాకారులు పురుషుల కబడ్డీ క్రీడలలో మూడో స్థానం నిలిచి బ్రాంజ్ (కంచు) పథకం సాధించడం జరిగిందని ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

బుధవారం జాతీయస్థాయి పీసా మహోత్సవాలు విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న పిసా ఉత్సవాలు చివరి రోజు వివిధ క్రీడలలో ఐటీడీఏ భద్రాచలం తరఫున పాల్గొన్న పురుషుల కబడ్డీ జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుకు మినిస్టరీ ఆఫ్ పంచాయతీరాజ్ సెక్రెటరీ న్యూఢిల్లీ వివేక్ భరద్వాజ్, మినిస్టరీ ఆఫ్ పంచాయతీరాజ్ డైరెక్టర్ రమిత్ మౌర్య, ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ శశిభూషణ్ కుమార్ వారి చేతులు మీదుగా క్రీడాకారులతోపాటు భద్రాచలం ఐటిడిఏ తరపున పాల్గొన్న సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ మరియు స్పెషల్ ఆఫీసర్ డేవిడ్ రాజ్ కంచు పథకమును మరియు 50 వేల రూపాయల నగదు పారితోషకాన్ని అందుకున్నారు.

జాతీయస్థాయి పీసా మహోత్సవాలలో పది దేశాలు పాల్గొన్న పాల్గొన్న ప్రతినిధులు ఐటీడీఏ భద్రాచలం తరపున ఏర్పాటు చేసిన గిరిజన వంటకాల స్టాల్ లో వారికి ఇష్టమైన గిరిజన వంటకాలు తనివి తీర చవిచూసి, కోయా క్రాఫ్ట్ వస్తువులు కొనుగోలు సంతోషం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న అధికారులకు మరియు క్రీడాకారులకు ప్రశంస పత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం స్పోరట్స్ ఆఫీసర్ శ్రీమతి జ్యోతి, పి ఆర్ డి డి సుభాష్ చంద్ర గౌడ్, కొండ్రు సుధారాణి, శీలం దుర్గ, గుండి లత, జజ్జరా నిఖిల్, పాయం కృష్ణమూర్తి మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.