calender_icon.png 18 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు సినిమాలో ప్రతీది గొప్పగా ఉంటుంది

18-12-2025 01:25:56 AM

రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయకి అనస్వర విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సినిమాతో తెలుగులోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా. లాంగ్వేజ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక భాష తెలిస్తే అందులో మనం ఇంప్రవైజ్ చేయగలం. కానీ భాష తెలియకపోతే ఆ సౌకర్యం ఉండదు. నాకు తెలుగు స్పష్టంగా రాదు. డైరెక్టర్‌తోపాటు యూనిట్‌లో అందరూ ఎంతగానో సపోర్ట్ చేయడం వల్లే తెలుగులో డైలా గ్స్ అంత చక్కగా పలకగలిగాను. -తెలుగు సినిమాలో ప్రతీది చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద కాన్వాస్‌లో సినిమాలు తీయడం నాకు చాలా నచ్చింది. 

‘గిరగిరా..’ సాంగ్ నాకు, మా ఫ్రెండ్స్‌కూ చాలా ఇష్టం. ఈ పాట షూటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేశాం. రోషన్ నుంచి కొన్ని డాన్సింగ్ మెలకువలు నేర్చుకున్నా. ఆయన స్వీటెస్ట్ కోస్టార్. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ప్రేక్షకురాలిగా ఇలాంటి సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఈ కథ, చంద్రకళ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది.  

నేను మోహన్‌లాల్‌కి పెద్ద ఫ్యాన్. కెరీర్ ఆరంభంలో ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టం. ఆయనతో నటించడం ఒక లైఫ్ టైమ్ మెమరీ. ‘రేఖా చిత్రం’ వెరీ మెమొరబుల్.  ఆ సినిమా టైమ్‌లో మమ్ముట్టితో ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఫ్యాన్ గర్ల్ మూమెంట్.  

నాకు వింటేజ్ పీరియడ్ సినిమాలు చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే మనం రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయలేని ఎలిమెంట్స్ అనుభవించవచ్చు. అప్పటి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు.  

హైదరాబాద్ ఫుడ్ చాలా స్పైసీ. ఇక్కడ బిర్యాని అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో అల్లు అర్జున్ చాలా ఇష్టం. మా సినిమా ట్రైలర్‌ను రామ్‌చరణ్ లాంచ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ‘మగధీర’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. 

నేను తెలుగులో కొత్తగా చేస్తున్న సినిమాలంటే.. ప్రస్తుతానికి ‘-ఇట్లు మీ అర్జున’ చేస్తున్నా. ‘ఛాంపియన్’ కంటే ముందే సైన్ చేసిన చిత్రమిది.