19-12-2025 12:00:00 AM
ఆది హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మీడియాతో పంచుకున్నారు. “శంబాల’లో చాలా థీమ్స్ ఉంటాయి. నేను ఎన్నో థ్రిల్లర్‌కు పనిచేశా. ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌కు పనిచేయడం కొత్తగా అనిపించింది.
వెరైటీగా సౌండ్ క్రియేట్ చేయాలని చూస్తుంటా. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టాలంటే సౌండ్‌తో ఎక్కువగా మిస్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీ కోసం రకరకాల ఇన్ స్ట్రూమెంట్స్ వాడాను. నేను నా సొంత పని కోసం కొన్న ఓ పరికరాన్నీ వాడేశా. నా వాయిస్‌తోనే రకరకాల సౌండ్స్ ఇచ్చా” అని చెప్పారు.