భద్రాద్రిలో ఎన్నికలకు సర్వం సిద్ధం
పటిష్ఠ భద్రత నడుమ ఈవీఎంల తరలింపు
భద్రాద్రి కొత్తగూడెం, మే 12 (వియజక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్ల మెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 9,88,238 మంది ఓటర్లు 1,105 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పూర్తి ఏజెన్సీ, నక్సల్స్ ప్రభా విత జిల్లా కావడంతో పటిష్ట బందోబస్తు నడుమ ఈవీఎఎంలను తరలించారు. ఆదివారం కొత్తగూడెంలోని రామచంద్ర డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక సందర్శించారు.
ఈ సదర్బంగా మాట్లాడుతూ.. పినపాక నియోజక వర్గంలో 250 పోలింగ్ కేంద్రాలు, ఇల్లెందు నియోజకవ్గరంలో 242, కొత్తగూడెంలో 253, అశ్వారావుపేటలో 184, భద్రాచలం నియోజకవర్గంలో 176 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్రాలకు గాను 1,212 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించామన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు కొత్తగూడెంలోని రామచంద్ర డిగ్రీ కాలేజీ, మణుగూరు సమితి సింగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను తనిఖీ చేశారు.




