రిజర్వు ఈవీఎంల బాధ్యత సెక్టార్ అధికారులదే
ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్
ఖమ్మం, మే 12 (విజయక్రాంతి) : రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వు పోలింగ్ సామగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలని, సెక్టార్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలను తూ.చ తప్పకుండా పాటిం చాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా ప్రలోభాలకు గురి చేయటం, ఉల్లంఘన లు దృష్టి కి వస్తే సీ యాప్కు, 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఖ మ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వర కు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెం బ్లీ నియోజకవర్గాల్లో ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీ మధుసూదన్‌నాయక్, సహాయ రిటర్నింగ్ అధికా రులు ఆదర్శ్ సురభీ, ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ముందు జాగ్రత్తలు తీసుకోండి
ఎండైనా, వానైనా అన్నింటికీ సన్నద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సిబ్బందికి ముందు జాగ్రత్త సూచనలు చేశారు. పనులన్నీ ఉదయం 6 గంటలలోపే పూర్తి చేయాలని, పోలింగ్ సిబ్బంది, పోలీసులు, సూ క్ష్మపరిశీలకులకు భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
230 సమస్యాత్మక కేంద్రాలకు కేంద్ర బలగాలు
230 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. పోలీస్ సిబ్బంది నిర్వహించే విధివిధానాలపై పలు సూచనలు చేశారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున భద్రత పరమైన అన్ని చర్యలు పకడ్భందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. ట్రైనీ ఏఎస్పీ మౌనిక, నగర ఏసీపీ రమణమూర్తి, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.




