02-12-2025 06:31:13 PM
మఠంపల్లి (విజయక్రాంతి): మఠంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం, అన్ని ఏర్పాట్లు చేశామని మండల అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలకు గాను మూడవ దశలో ఎన్నికలు జరగనున్న మఠంపల్లి మండలంలో 29 గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు మండల యంత్రాంగం, ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారని, బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మండలంలో ఏర్పాటు చేయబడిన ఐదు క్లస్టర్ పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని మఠంపల్లి మండల అభివృద్ధి అధికారి పాత్రీకేయులకు తెలిపారు.