calender_icon.png 2 December, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి సీనియర్ జూడో ఛాంపియన్షిప్ పోటీలలో పారమిత విద్యార్థి ప్రతిభ

02-12-2025 06:28:19 PM

ముకరంపుర (విజయక్రాంతి): తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 29, 30న హైదరాబాద్ జిల్లాలో జరిగిన 10వ సీనియర్స్ రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్షిప్ పోటీలలో పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థి ఎ. అభినవ్ సాయి 73 కె.జి కేటగిరి విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించాడని పాఠశాల డైరెక్టర్ కె.హన్మంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎ. అభినవ్ సాయిని పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ, సమన్వయకర్త రబీంద్రపాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు గోలి సుధాకర్, సరిగొమ్ముల రాజులు అభినందించారు.