calender_icon.png 18 November, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం

10-09-2024 10:42:32 AM

నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు. శ్వేతా రెడ్డి పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం శంషాబాద్ మీదుగా నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ స్వగ్రామానికి తరలించనున్నారు.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రాజకీయ రంగప్రవేశం నుండి తనతో పాటు వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ ముఖ్యులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరి మన్నలను పొందిన ఆమె మరణించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ముఖ్యులు సంతాపం ప్రకటించారు.  మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు హాజరు కాలినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.