calender_icon.png 18 November, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

10-09-2024 10:58:23 AM

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 12 గేట్లను ఎత్తి 95,940 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 589 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 309.08 టీఎంసీలు నీటి నిల్వ  ఉండగా, పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కొనసాగుతుంది.సాగర్ గేట్లు ఎత్తివేయడంతో చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.