calender_icon.png 16 August, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆత్రం సక్కు

05-12-2024 03:34:46 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోవలక్ష్మి మీపై  ఓటమి చెందారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి పై కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగిన అత్రం సక్కు గెలుపొంది స్వల్ప కాలంలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2023లో సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న కోవలక్ష్మికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆత్రం సక్కు ఎంపీ కీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుండి బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో సక్కు సొంత గూటికి చేరారు.