calender_icon.png 17 August, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ఫార్మసిస్ట్ ఆత్మహత్య

05-12-2024 03:30:17 PM

భర్త దుబాయిలో భార్య బిచ్కుందలో ఉద్యోగం

ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో?

కామారెడ్డి జిల్లాలో కలకలం

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో కాంట్రాక్ట్ ఫార్మసిస్టుగా పనిచేస్తున్న శిరీష 28 అనే యువతి కామారెడ్డి లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఉద్యోగానికి అన్ని వెళ్లిన శిరీష బుధవారం ఇంటికి రాలేదు. కామారెడ్డి భూపుత్రమ్మ కళ్యాణమండపం వర్గాల రేకుల షెడ్డులో శిరీష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు శ్రీమణి అండ్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆద్య రెండు సంవత్సరాలు భర్త స్వామీ దుబాయ్ లో ఉంటున్నాడు.

యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణాలు తెలియజేయడం లేదు. ఆత్మహత్య కావాలని చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మృతురాలి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలే చిన్నారులు ఉండడంతో తండ్రి దుబాయ్ లో ఉండడంతో చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు బంధువులు రోదించారు.