calender_icon.png 16 August, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులు అనుభవించే ప్రతిహక్కు ఏఐటీయూసీ కృషి ఫలితమే

05-12-2024 04:49:40 PM

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): దేశంలో, రాష్ట్రంలో కార్మికులందరూ అనుభవించే ప్రతి హక్కు ఏఐటీయూసీ కృషి పోరాట ఫలితమేనని, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎండి యూసఫ్ అన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్, రాజకీయ సైతాంతిక శిక్షణ తరగతులు రెండు రోజులపాటు జరిగే సభలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను లేబర్ కోడులను రద్దు చేయాలని, అదేవిధంగా జాతీయ కనీస వేతనం చట్టం ప్రకారం అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించాలన్నారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యాలకు, పారిశ్రామిక వేత్తలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.

ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు కేంద్రంలోని మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ ఈ దేశ ప్రజలకు, కార్మికవర్గా పట్ల విపక్ష చూపిస్తున్నారని అన్నారు. చట్టాల, హక్కుల అమలుకోసం  కార్మికులకు అండగా ఏఐటీయూసీ నిలుస్తుందని, ఉద్యమాలు, పోరాటాల నిర్వహిస్తామని హక్కులను కాపాడుకోవాలని, నూతన హక్కులు సాధించుకోవాలని, భవిష్యత్తులో సంక్షేమ బోర్డును ప్రైవేటుపరం చేసే ఆలోచన విరమించుకోవాలని, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డును కార్మిక సంఘాల నాయకులతో నిర్మించి కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ ప్రచార  ఆందోళనలు యూనియన్ నిర్మాణం ను బొందించారు . ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు కమ్యూనిస్టు మూల సూత్రాలు అనే అంశం బోధించారు.