పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్
19-03-2026 01:00 AM
మఠంపల్లి, మార్చి 18 : మండల కేంద్రములోని మండల ప్రజా పరిషత్ పాఠశాలను బుధవారం మఠంపల్లి గ్రామ సర్పంచ్ ఏసుమళ్ల వీర లక్ష్మి, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతిలు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనమును,పాఠశాల పరిసరాలను,
విద్యార్థుల సంఖ్యను తనిఖీ చేశారు. తదుపరి అంగన్వాడి కేంద్రం, భవిత కేంద్రమును పరిశీలించి పలు విషయాలపై ఆరాతీశారు. తదుపరి వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలని, పాఠశాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.కిరీటం ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




