మూడంచెల భద్రతలో ఈవీఎంలు
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 144 సెక్షన్ అమలు
కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో పర్యవేక్షణ
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఓటర్లు ఈవీఎంలలో తమ తీర్పును నిక్షిప్తం చేశారు. ఈ క్రమంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల సమన్వయంతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు పహారా కాయనుండగా, మిగతా రెండు అంచెల్లో రాష్ట్ర పోలీసులు పర్యవేక్షిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉన్నతాధికారులు స్ట్రాంగ్ రూములను పర్యవేక్షిస్తారు. ఇదిలా ఉంటే, స్ట్రాంగ్ రూముల వద్దకు అధికారులు ఎవరెవరు వచ్చిపోతున్నారనేది రికార్డు చేయడానికి ఒక బుక్‌లా గ్‌ను నిర్వహిస్తారు. పరిసర ప్రాంతాల్లో అన్ని కదలికలు తెలిసేలా సీసీ కెమెరాలతో సర్వైలైన్స్‌ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. స్ట్రాంగ్ రూ ముల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుం డా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన..
మంథని, మే 14: రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరచగా.. జిల్లా కలెక్టర్ ముజి మ్మిల్ ఖాన్, పార్లమెంట్ ఎన్నికల సాధారణ అధికారి రవీష్ గుప్తా మంగళవారం పరిశీలించారు. రాజకీయ నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు అధికారులు తాళాలు వేశారు.
నిజామాబాద్, మే 14 (విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఈవీఎంలను డిచ్‌పల్లి మండలం నడిపల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియను పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలీస్ వజర్, నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమ క్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేశారు.
మహబూబ్‌నగర్, మే 14 (విజయక్రాం తి): మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఈవీఎంలను పాలమూరు యూని వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచినట్లు కలెక్టర్ జీ రవి నాయక్ తెలిపారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయడం జరిగిందని వివరించారు.
మంచిర్యాల, మే 14(విజయక్రాంతి): హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంను రామగుండం సీపీ శ్రీనివాస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
కామారెడ్డి, మే 14 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలను సంగారెడ్డికి తరలించగా, ఎన్నికల పరిశీలకుడు గోపాల్ తివారి, జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తరలింపును పర్యవేక్షించారు.
జూన్ 4 రాత్రి వరకు..
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతపై ఆయా జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేశారు. జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు రాత్రి వరకు ఈ మూడంచెల భద్రతతో పాటు ఇతర ఆంక్షలను ఈసీ కొనసాగించనుంది. ఈ మధ్య కాలంలో స్ట్రాంగ్ రూములను ఎవరైనా ఓపెన్ చేయాలని చూసినా అంది అంత సులువు కాదు. ఎందుకంటే స్ట్రాంగ్ రూములకు రెండు తాళాలు ఉంటాయి. అందులో ఒకటి జిల్లా ఎన్నికల అధికారి వద్ద.. రెండోది రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. కాబట్టి రెండు తాళాలు ఉంటేనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అవుతుంది. స్ట్రాంగ్ రూముల వద్దకు ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదు. అధికారులైనా, పోలీసులైనా, ఆఖరికి అభ్యర్థులైనా.. ఎవరొచ్చినా మూడో అంచె భద్రత వద్ద తమ వెహికిల్స్‌ను ఆపాల్సి ఉంటుంది.




