18 July, 2026 | 7:19 PM

Breaking News

బూర్గంపాడు ఆసుపత్రి సేవలు భేష్   •   మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి   •   నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •  

బూర్గంపాడు ఆసుపత్రి సేవలు భేష్

18-07-2026 07:19 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండబడిన డాక్టర్లు సేవలందించడంలో భేష్ అని ఇక్కడ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కొనియాడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యదర్శి డి.పున్నం చంద్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నందున ఇక్కడ నిత్యం 250 నుంచి 200 మంది వరకు ఆసుపత్రికి వచ్చి సేవలు పొందుతూ షుగర్ పేషెంట్లు,బిపి పేషెంట్లు,రక్త పరీక్ష కేంద్రంలో వచ్చి కూడా సేవలు అందుతున్నాయని వారన్నారు.

పురాతన ఆసుపత్రి అయినా గాని ఏదో రకంగా సిబ్బంది తమ వంతు కర్తవ్యంగా 24 గంటలు ఆసుపత్రిలో ఉంటున్నారని వారు తెలిపారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కూడా కొనసాగుతుందని ఔట్ పేషెంట్లు 250నుంచి 200వరకు వచ్చినప్పటికీ వారి సేవలు ఇక్కడ సిబ్బంది సకాలంలో అందించి ప్రజలు మన్నలు కూడా పొందడం జరుగుతుందని ఇన్ పేషెంట్లకు కూడా 30 నుండి 50 మంది వరకు ఉంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఆస్పత్రి విషయంలో స్థానిక ప్రజలు ఇతర ప్రజాస్వామ్యవాదులు స్థానిక ఆసుపత్రి సేవలు పోయాడుతూ ఆసుపత్రి మరింత అభివృద్ధి కోసం ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కూడా ప్రయత్నం చేయాలని పున్నం చంద్ విజ్ఞప్తి చేశారు