18 July, 2026 | 7:42 PM

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి

18-07-2026 07:12 PM

* జిల్లా విద్యాధికారి మాధవి..

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో  విద్యనభ్యసించే  విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా  విద్యా బోధన చేస్తూ  ఉన్నత విద్యావంతులుగా  తీర్చిదిద్దుటకు చక్కటి పునాదిని ప్రాథమిక పాఠశాలలో వేయాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని ఏమయికుంటా ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోషకుల సమావేశంలో పాల్గొన్నారు. తరగతి గదులలో విద్యార్థుల విద్యా బోధనపై పరిశీలించారు.

అనంతరం పోషకుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... ఎజెండాలో భాగంగా తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థుల గురించి ప్రతిభలో వచ్చినటువంటి మార్పు గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఎందులో వెనుకబడి ఉన్నారో, దానికోసం ఉపాధ్యాయులుగా ఎలా  బోధన ప్రణాళికలను తయారు చేయాలో ఉపాధ్యాయులతో చర్చించడం  జరిగింది. హాజరు పరంగా, నాణ్యత పరంగా మంచి పర్ఫామెన్స్ చూపిస్తున్న  ఇద్దరు విద్యార్థులను DEO సన్మానించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన అందుతుందని, పౌష్టికాహారమైన భోజనం అందిస్తున్నారని, ఉచితంగా టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్కులు ఇవ్వడంతోపాటు, యూనిఫార్మ్స్ కూడా సరఫరా చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా ఎంపీ యూపీఎస్ ఏమైకుంట పాఠశాలకు AXL ఏఐ ఆధారిత ప్రోగ్రాంలో భాగంగా 5 సిస్టమ్స్ మంజూరు అయ్యాయని తెలియజేశారు. దానికిగాను గ్రామస్తులు, తల్లిదండ్రులు పోషకులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఏమాయికుంట పాఠశాల విద్యార్థులు ఆంగ్లంలో, గణితంలో, తెలుగులో చూపినటువంటి ప్రతిభా ప్రదర్శనకు DEO మేడంగారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి నెల తల్లిదండ్రులు అందరూ తప్పకుండా పిటిఎం సమావేశానికి హాజరుకావాలని తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మన పాఠశాల విద్యార్థులే అన్నిట్లో ముందుంటారని, ప్రైవేట్ విద్యార్థులు భట్టి విధానంలో నేర్చుకుంటారని తెలియజేశారు. కావున అందరూ గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సమావేశంలో తెలియజేశారు.

ఏమయికుంటా గ్రామ సర్పంచ్ గారు తమ పిల్లలను Yemaikunta పాఠశాలలో వేయడం చాలా మంచి విషయమని సర్పంచి గారిని అభినందించారు. ప్రీ ప్రైమరీ పిల్లలు చేసినటువంటి డ్యాన్స్ కు DEO మేడం చాలా సంతోషపడ్డారు. ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ తేజస్విని అభినందించారు. ఈ కార్యక్రమంలో  సీఎంఓ తిరుపతి  పిల్లల తల్లిదండ్రులు, పోషకులు, గ్రామస్తులు,  సర్పంచ్ లఖన్ సింగ్, ఉపసర్పంచ్ సెక్రటరీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరు పాల్గొనడం జరిగింది.