18 July, 2026 | 6:41 PM

Breaking News

మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •  

మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం

18-07-2026 06:41 PM

నూతనకల్: మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త దివంగత మెంచు లింగమల్లు దశదిన కర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రూ.55,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... మెంచు లింగమల్లు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త అని కొనియాడారు.

ఆయన సేవలను స్మరించుకుంటూ, కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెంచు లింగమల్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నాయకులు, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు.