మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్ పల్లి,(విజయక్రాంతి): మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ.16,25,500లను సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
వార్డులలో సమస్యలు ఉంటే కౌన్సిలర్ వెంటనే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా వర్షాకాలం దృష్ట పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లేదంటే దోమలు,ఈగలు ప్రభలి ప్రజలు రోగాల భారీన పడతారని అన్నారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కాగా ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, ఎంతోమంది వివిధ రకాల రోగాలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే వారిని ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను పొందాలని సూచించారు.






