18 July, 2026 | 7:17 PM

Breaking News

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి   •   నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •  

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు

18-07-2026 06:47 PM

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి

​ఆమనగల్లు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు ఆయన ఉచిత యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టులను పంపిణీ చేశారు.​ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతిభగల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే కేరాఫ్ అడ్రస్ అని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఉచిత విద్య, యూనిఫామ్‌లతో పాటు నాణ్యమైన ఆహారాన్ని, కాస్మెటిక్స్‌ను అందిస్తోందని చెప్పారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.