12 June, 2026 | 6:20 PM

గర్రెపల్లిలో ఎక్సైజ్ దాడులు

12-06-2026 05:36 PM

నాటుసార అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్  శ్రీనివాసరావు  ఆదేశాల మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం  గర్రెపల్లి గ్రామంలో జాయింట్ రైడ్ నిర్వహించి, నాటు సారాయి అమ్ముతున్నారనే సమాచారంతో  ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి వారి నుండి 10 లీటర్ల నాటు సారాయి, 20 కిలోల బెల్లం స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గుడుంబా తయారు చేయటానికి ఉపయోగించిన బెల్లం పానకం  సుమారు 400 లీటర్లలను స్పాట్ లోనే ధ్వంసం చేసాము,ఇక పైన ఎవరైనా గుడుంబా అమ్మిన, తయారు చేసిన, రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎక్సైజ్ సిఐ బాబా , సుల్తానాబాద ఎస్సై చిరంజీవి, కరీంనగర అర్బన్ సిబ్బంది, తిమ్మాపూర్ సిబ్బంది, రూరల్ సిబ్బంది, సురేష్, ఆసిఫ్, అనిల్ శ్రీనివాస్. కోటెశ్వర్ , చైతన్య,రవి , స్రవంతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.