16-12-2024 12:41:48 AM
మహిళల ఆసియా కప్ విజేత భారత్
మస్కట్: మహిళల జూనియర్ ఆసియా కప్‌ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. ఆదివారం మస్కట్ వేదికగా చైనాతో జరిగిన ఫైనల్లో మన అమ్మాయిలు షూటౌట్‌లో 3 విజయం సాధించి డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకున్నారు. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1 నిలిచాయి. చైనా తరఫున కెప్టెన్ జిన్‌హుయాంగ్ (ఆట 30వ నిమిషంలో).. భారత్ తరఫున సివాచ్ కనికా (41వ ని.లో) గోల్స్ సాధించారు. షూటౌట్ లో సాక్షి రానా,ఇషికా, సునెలిటా బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించి భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించారు. మ్యాచ్ ఆ ద్యంతం చైనాకు కొరకరాని కొయ్యగా మా రిన నిధి షూటౌట్‌లోనూ చైనా గోల్స్ చేయకుండా అడ్డుగోడలా నిలబడింది. టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన దీపికా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు దక్కించుకుంది.