7 April, 2026 | 3:51 PM

ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని

07-04-2026 02:06 PM

హనుమకొండ,(విజయక్రాంతి): ఎంజీఎం ఆస్పత్రిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.జనరల్ ఓపి విభాగంలో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.విధులల్లో ఉన్న వైద్యులతో నేరుగా మాట్లాడుతూ రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సూపరిండెంట్ ఛాంబర్ లో ఇటీవలే దవాఖానలో జరుగుతున్న పరిణామలపై సుదీర్ఘంగా చర్చించారు. మెడిసిన్ విభంగాలో ఉన్న అలసత్వం కావాల్సిన నిధులపై సత్వరమే ప్రణాళిక ఇవ్వాలని కోరారు.పేద ప్రజలకు వైద్యారోగ్యంలో కల్పవృక్షం లాంటి ఈ దవాఖానను ప్రతి ఒక్కరి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, యువ నాయకులు విష్ణు రెడ్డి, పల్లంకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.