16-12-2024 12:36:37 AM
ఢిల్లీ: ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచి న భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. మా అమ్మ నా సక్సెస్ మంత్ర అని గుకేశ్ పేర్కొన్నాడు. ప్రతీ టోర్నీకి ముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూనే ఉంటానని వెల్లడించాడు. ‘ నువ్వు గొప్ప చెస్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నువ్వు గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి మరింత సంతోషిస్తా.
ఆమె సందేశానికి విలువనిస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవలే సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లో చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ చాంపియన్‌గా నిలిచాడు. కాగా ఎక్స్ అధినే త ఎలన్ మస్క్ గుకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. చాంపియన్‌గా నిలిచిన అనంతరం గుకేశ్ తన ఎక్స్ ఖాతాలో 18వ టోర్నీ.. 18 ! అంటూ పోస్ట్ పెట్టాడు. మస్క్ రిప్లు ఇస్తూ ‘కంగ్రాట్స్ గుకేశ్’ అని రీట్వీట్ చేశాడు.