‘టెట్’ మార్పులకు కసరత్తు!

17-09-2026 | 05:05am

సిలబస్, మార్కులు, పరీక్ష విధానంపై సమీక్షకు సబ్‌కమిటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Teacher Eligibility Test) (టెట్) సిలబస్(Syllabus), అర్హత మార్కులు(Marks), పరీక్ష విధానాన్ని(Examination Pattern) సమీక్షించి అవసరమైన మార్పులు సూచించడానికి ఉపసంఘాన్ని ( సబ్ కమిటీని) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎన్సీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ పంకజ్ అరోరా(NCTE Chairman Professor Pankaj Arora) తెలిపారు. బుధవారం ఎస్టీఎఫ్‌ఐ అధ్యక్షుడు సిఎన్ భార్తి నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు కెఎస్‌ఎస్ ప్రసాద్, ఎన్.వెంకటేశ్వర్లు ఢిల్లీలో

ఎన్సీటీఈ చైర్మన్ అరోరా, మెంబర్ సెక్రటరీ సుఖ గీత్‌కౌర్, డిప్యూటీ సెక్రటరీ సతీశ్ కుమార్ తదితరులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సెక్రటరీ (అకడమిక్) సతీశ్ కుమార్‌తో జరిగిన సమావేశంలో టెట్ పరీక్షలోని ఇబ్బందులను వారికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపా ధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, సిలబస్‌ను శాస్త్రీయంగా నిర్ణయించాలని, సబ్జెక్టు వారీగా పరీక్షలు నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని ఎస్టీఎఫ్‌ఐ ప్రతినిధులు కోరారు.

ఎన్సీటీఈ అధికారులు సానుకూలంగా స్పందించారని త్వరలోనే సమస్యకు పరి ష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంను సందర్శించి వచ్చే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారినే ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత  ఉపాధ్యాయులకు ఓటుహక్కు కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు