15 August, 2026 | 11:43 PM

అత్యున్నత ప్రదర్శన ఆశిస్తున్నాం

20-08-2024 12:30 AM

పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం

న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నుంచి యావత్ దేశం అత్యున్నత ప్రదర్శన ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం భార త పారా అథ్లెట్ల బృందంతో మోదీ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పారిస్ వెళ్లనున్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ఈ జర్నీ మీ కెరీర్‌కు చాలా ముఖ్యమైనది. పారాలింపిక్స్‌లో మీరు సాధి ంచే విజయాలపై దేశ ప్రతిష్ట ఆధారపడి ఉంది. 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలు మీపై ఉన్నాయి.

విజయీభవ. ఆసి యా పారాలింపిక్స్, టోక్యో పారాలింపిక్స్ మించి పారిస్‌లో కొత్త రికార్డులను నెలకొల్పాలని ఆశిస్తున్నాం’ అని మోదీ పారా అథ్లెట్లకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం పారా ఆర్చర్ శీతల్ దేవీతో మాట్లాడిన మోదీ తొలి ఒలింపిక్స్ ఆడుతున్న ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత జావెలిన్ స్టార్ సుమిత్ అంటిల్, షూటర్ అవనీ లేఖ రా, తైక్వాండో స్టార్ తరుణ్ అన్వర్, మరియప్పన్ తంగవేలు సహా మిగతా అథ్లెట్లతో సంభాషించారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్న పారాలింపిక్స్‌లో ఈసారి భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.