15 August, 2026 | 10:53 PM

సెమీస్‌లో రొనాక్ దహియా

20-08-2024 12:30 AM

అమ్మన్ (జోర్డాన్): భారత గ్రీకో రోమన్ రెజ్లర్ రొనాక్ దహియా అండర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల 110 కేజీల విభాగం క్వార్టర్స్‌లో రొనాక్ డానిల్ మస్లాకోపై టెక్నికల్ సుపీరియారిటీ పద్దతిలో విజయాన్ని అందుకున్నాడు. అంతకముందు తొలి రౌండ్‌లో రొనాక్ 8 తేడాతో ఆర్థర్ మన్వెలియన్‌ను చిత్తుగా ఓడించాడు. ఇక సెమీస్‌లో దహియా హంగేరీకి చెందిన జొల్టన్ జాకోను ఎదుర్కోనున్నాడు.