వయోవృద్ధుల అనుభవాలు జిల్లా అభివృద్ధికి దోహదం

28-09-2026 | 06:43pm

ఆరోగ్యంగా.. చురుకుగా ఉండాలి

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): వయోవృద్ధుల అనుభవాలు, సలహాలు జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు ఆరోగ్యంగా, చురుకుగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అత్యవసర సేవల కోసం 14567కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీపీఆర్వో శ్రీనివాస్, ఎస్సై, మున్సిపల్ కౌన్సిలర్ శారద, కోఆప్షన్ సభ్యురాలు రేణుక, డే కేర్ సెంటర్ సమన్వయకర్త సంజీవరావు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు