24 April, 2026 | 3:57 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి   •   దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి వాకబు   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   మేకల కాపరులపై దాడితో దుశ్చర్లపై ప్రతి దాడి   •   తాండూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్   •   'అంగ, బంగా, కళింగ'లో బీజేపీ ప్రభుత్వాలు.. TMCకి ఓటమి తప్పదు   •   నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహంతో బండి సంజయ్ నిరసన   •   తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి   •   అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం   •  

డీఎస్సీ కీ తప్పులపై నిపుణుల కమిటీ రివ్యూ!

11-09-2024 12:56 AM

టెట్ మార్కుల అప్‌లోడింగ్‌కు అవకాశం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): డీఎస్సీ ఫైనల్ కీ లో దొర్లిన తప్పులపై అధికారులు పునఃపరిశీలించనున్నారు. దీనిపై నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై పరిశీలించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. డీఎస్సీ ఫైనల్ కీ లోనూ చాలా వరకు తప్పులు దొర్లినట్లు పలువురు అభ్యర్థులు ఆధారాలతో సహా సోమవారం అధికారులకు అభ్యంతరాలు సమర్పించారు. ఈ అభ్యంతరాలపై నిపుణుల కమిటీ సమావేశమై, నిజానిజాలను తేల్చనుంది. ఒకవేళ తప్పులు దొర్లినట్లు గుర్తిస్తే రివైజ్డ్ కీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఫైనల్ కీ నే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా మంది అభ్యర్థులు తమ టెట్ మార్కుల వివరాలను అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయలేదు. దీంతో టెట్ మార్కులను అప్‌లోడ్ చేసుకునేందుకు అధికారులు మరోసారి అవకాశం కల్పించనున్నారు.