6 May, 2026 | 8:15 AM

గురుకుల బోర్డుకు మెడికల్ రిపోర్టులు

24-06-2024 01:10 AM

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): దివ్యాంగ అభ్యర్థుల మెడికల్ రిపోర్టులు గురుకుల బోర్డుకు అందినట్లు ఆదివారం రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రైబ్) తెలిపింది. వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఇటీవల సరోజిని దేవి కంటి ఆసుపత్రి, ఈఎన్టీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు నిర్వహించామని, వైద్యపరీక్షలకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించి తదుపరి ప్రకటన విడుదల చేస్తామని ప్రకటించింది.