28 August, 2026 | 5:03 PM

భారత ప్రభుత్వ బోర్డు సభ్యులు తురక నరసింహాను కలిసిన మద్దిశెట్టి సామేలు

28-08-2026 03:58 PM

సత్తుపల్లి,ఆగస్టు 28 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చిన భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డి-నోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార కమ్యూనిటీల అభివృద్ధి, సంక్షేమ బోర్డు మాజీ సభ్యులు తురక నరసింహాని, వారి ఆహ్వానం మేరకు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన పలు ప్రజా సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలపై పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న దాడులు, అక్రమ కేసులు తదితర అంశాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని మద్దిశెట్టి సామేలు తురక నరసింహాకి వివరించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా యూత్ బ్రిగేడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొరస రమేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు పలగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.