29-07-2025 02:28:54 AM
విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.25 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కే ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల కు సంబంధించి హైడ్రా కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులతో నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల పరిరక్షణ, వరదల నిర్వహణతో పాటు నగర విపత్తు నిర్వ హణ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేపట్టనున్నారు.