21-02-2026 01:07:51 AM
మంటల్లో కాలి కెమిస్ట్ మృతి
యాదాద్రి జిల్లా దోతిగూడెం శివారులోని వీజే సాయి పరిశ్రమలో ప్రమాదం
చౌటుప్పల్ (పోచంపల్లి), ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని వీజే సాయి కెమికల్ ల్యాబ్‌లో శుక్రవారం జరిగిన పేలుడులో కెమిస్ట్ మృతిచెందాడు. డ్రమ్ములో కెమికల్ నింపుతుండగా ఒక్క సారిగా పేలుడు సంభవించినట్లు తెలిసింది. దీంతో కెమికల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటలలో కెమికల్ డ్రమ్ములు కాలిపోవడంతో పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పేలుడు ధాటికి కంపెనీ నుంచి కెమి కల్ ద్రావకం బయటకు ప్రవహించింది. ఈ ఘటనలో పేలుళ్ల ఘటనలో కెమిస్ట్ ధార పవ న్ (35) కాలి మృతిచెందాడు. పేలుడు శబ్దా లు కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో పాటు కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటనను గోప్యంగా దాచిన యాజమాన్యంపై మృతుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.