28 April, 2026 | 3:21 AM

గర్రెపల్లిలో గుడుంబా స్తావరాలపై విస్తృత దాడులు

28-04-2026 01:46 AM

ఇద్దరిపై కేసు నమోదు....

సుల్తానాబాద్ , ఏప్రిల్ 27 (విజయక్రాంతి): పెద్దపల్లి డి పి ఈ ఓ మహిపాల్ రెడ్డి ,సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ గురునాథ్ ఆదేశాల మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం  గర్రెపల్లి గ్రామంలో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి 7 లీటర్ల నాటు సారా, 10 కిలోల బెల్లం,15 కిలోల పటిక స్వాధీనం చేసుకొని ,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులు పై కేసు నమోదు చేసినామని ఎక్సైజ్ ఎస్త్స్ర చిరంజీవి తెలిపారు,

కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్త్స్ర వెంకటేశ్వర రావు, పెద్దపల్లి డిటిఎఫ్  ఎస్త్స్ర పావని  టీం లతో దాడులలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్రెపల్లి గ్రామంలో ఎవరైన గుడుంబా తయారు చేసిన,అమ్మిన, రవాణా చేసిన చట్ట రీత్యా కఠిన చర్యల ఉంటాయని హెచ్చరించారు, ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్స్ ,  కానిస్టేబుల్స్ శ్రీకాంత్, నాగేందర్, సుమన్, సురేష్, నాగరాజు, నవీన్, అనిల్, సరోజన, దివ్య,సంగీత తదితరులు పాల్గొన్నారు.