12 May, 2026 | 11:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి రూ.3 లక్షల విరాళం

28-04-2026 01:46 AM

వారణాసి భవాని పేరుతో విద్యార్థులకు స్వర్ణ పతకం

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 27: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థుల విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు, ఎం.ఎస్సి జువాలజీ విభాగంలో టాపర్గా నిలిచిన విద్యార్థినికి స్వర్ణ పథకాన్ని అందజేస్తామని యూనివర్సిటీ వి సీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ రిజిస్టర్ అంజిరెడ్డిలు అన్నారు. బి వీరభద్ర ప్రసాద్ తన కుటుంబ సభ్యులు రిటైర్డ్ హెడ్మాస్టర్ వారణాసి భవాని జ్ఞాపకార్థం స్వర్ణ పతకం కోసం రూ. 3 లక్షల చెక్కును విశ్వవిద్యాలయoకు సోమవారం అందజేశారు.

విద్యార్థిల కృషి, ప్రతిభ, ఉన్నత విద్యలో సాధిస్తున్న విజయాలను గౌరవిస్తూ ఈ స్వర్ణ పతకం ఏర్పాటు చేయడం విశేషమని వీసీ అన్నారు. విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక పురోగతికి ప్రధాన ఆధారమని, అమ్మాయిలు విద్యలో మరింతగా రాణించేందుకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. రిటైర్డ్ హెచ్‌ఎం వారణాసి భవాని జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ స్వర్ణ పతకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థినులకు మరింత స్ఫూర్తి, ఉత్తేజం కలుగుతుందని, భవిష్యత్తులో వారు పరిశోధన, ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో అద్భుతంగా రాణించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోసిఓఈ డా.జి.ఉపేందర్ రెడ్డిపాల్గొన్నారు.