12 May, 2026 | 11:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

28-04-2026 01:48 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 27: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని సర్పంచ్ నున్న యాదగిరియాదవ్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యనాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సత్యం,ఉపసర్పంచులు మాండ్ర గోవర్ధన్,గడ్డం ఉమావెంకన్న,తాడూరి రామకోటి,నున్న సురేష్,వల్లపు శ్రీను,బషీర్,కేంద్ర నిర్వాహకులు సునీత,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.