15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కళ్లు చెదిరే ఆస్తులు

12-06-2025 01:22 AM
  1. ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అరెస్ట్ 
  2. అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు 
  3. 20 చోట్ల ఏకకాలంలో తనిఖీలు 
  4. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారిగా విధులు 
  5. ప్రాజెక్టుల కాంట్రాక్టుల కేటాయింపులో అక్రమాలపై నిఘా 
  6. థాయ్‌లాండ్‌లో కుమారుడి పెళ్లి, ఫాంహౌస్‌లో వేడుకలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం కరీంనగర్‌లో అరెస్టు చేశారు. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు మొత్తం 20 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

కరీంనగ ర్‌లోని భాగ్యనగర్‌లో ఉన్న ఆయన నివాస గృహం, కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు తొమ్మిది చోట్ల, హైదరాబాద్‌లోని మలక్‌పేటతో పాటు ఆరు చోట్ల, బెంగళూరులో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు కొనసాగుతున్నా యి. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ దాడులు బుధవారం తెల్లవారుజాము నుంచే కొనసాగాయి.

కరీంనగర్‌లో అదుపులోకి తీసుకున్న శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. ఏసీబీ సోదాల్లో శ్రీధర్ అక్రమంగా కూడబెట్టిన భారీ ఆస్తుల చిట్టా బయటపడే అవకాశం ఉంది. మార్చి 2న ఒక ఫామ్ హౌస్‌లో తన కుమారుడి హల్దీ, సంగీత్ ఫంక్షన్లను అత్యంత ఘనంగా నిర్వహించిన శ్రీధర్, మార్చి 6న థాయ్‌లాండ్‌లో కుమారుడి వివాహాన్ని జరిపించారు.

ఆ తర్వాత మార్చి 9న నాగోల్‌లోని శివం కన్వెన్షన్ హాల్‌లో ఎంతో వైభవంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల కోసం శ్రీధర్ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ ఖర్చుల పత్రాలను ఆయన ముందు పెట్టి అధికారులు నిలదీస్తున్నట్లు సమాచారం. 

ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్టబెట్టి రూ.కోట్ల సంపాదన?

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని 6, 7, 8 ప్యాకేజీల పనులను సుదీర్ఘకాలం పాటు నూనె శ్రీధర్ పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఇరిగేషన్ శాఖ సీఏడీ డివిజన్--8లో విధులు నిర్వర్తిస్తూ, చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్నా రు. అంతేకాకుండా, ఇరిగేషన్ ఇంజనీర్ల సం ఘం అధ్యక్షుడిగానూ కొనసాగుతుండటం గమనార్హం. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ ఈ సోదాలను ముమ్మరం చేసింది.

ఈ దాడు ల్లో అక్రమాస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు, ఈ అక్రమాస్తుల వెనుక ఉన్న పూర్తి వివరాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దర్యాప్తు ద్వారా మరిన్ని సంచల న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.