15 June, 2026 | 11:41 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

భక్తులకు వసతులు మెరుగుపరచాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

18-11-2025 12:00 AM

అచ్చంపేట, నవంబర్ 17: నల్లమలలో వెలసిన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించాలని.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు  వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. 30 నుంచి డిసెంబర్ 4 వరకు పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం  అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలయ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని.. దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానంగా తాగునీటి ఇబ్బంది, విద్యత్, పారిశుద్ధ్య నిర్వాహణ పకడ్బంధీగా ఉండాలని ఆదేశించారు.

ఉత్సవాలు ప్రారంభానికి ముందే అవసరమైన వసతులు క్పలించాలన్నారు. ఆలయం ఆవరణలో త్వరలోనే సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆలయ ఛైర్మన్ రాములునాయక్, పాలక మండలి సభ్యులు,  పురపాలిక ఛైర్మన్ శ్రీనివాసులు, ఈవో రంగాచారీ, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ హేమలత, ఆర్‌అండ్ బీ డీఈ జలందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.