calender_icon.png 18 November, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్

18-11-2025 12:00:00 AM

గ్రీవెన్స్‌లో పలు ఫిర్యాదులను పరిశీలించి మాట్లాడిన ఎస్పీ

నల్గొండ క్రైం, నవంబర్ 17: ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 28 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.. ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నదని, ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.