calender_icon.png 18 November, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

18-11-2025 12:00:00 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, నవంబర్ 17(విజయక్రాంతి) : ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు.

ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఈ సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు రాగా,73 పిర్యాదులు జిల్లా అధికారులకు,56 రెవిన్యూ శాఖకు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్  అధికారులతో మాట్లాడుతూ  వర్షం కారణంగా గ్రామాలలో నీరు నిలువ లేకుండా చూడాలని, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా శానిటేషన్ చేయాలని. చెప్పారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, నల్గొండ ఆర్డీవో  వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులును స్వీకరించారు.