13 May, 2026 | 1:30 AM

బస్టాండులో సౌకర్యాలు కల్పించాలి

13-05-2026 12:00 AM

ములుగు కలెక్టర్ హేమంత్ సహదేవరావు

ములుగు (మహబూబాబాద్) మే 12 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్టాండులోప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని,వేసవి కాలం దృష్ట్యా జిల్లా కేంద్రం లో చలివేంద్రాల సంఖ్య పెంచాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ములుగు తాత్కాలిగ బస్టాండ్ ఆవరణ పరిసరాలను, ములుగు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాన్ని, చలి వేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా తాత్కాలిక బస్ స్టాండ్ ఆవరణ పరిసరాలను పరిశీలించి బస్సులు సమయపాలన, వసతుల కల్పన పలు అంశాలను అడిగి తెలుసుకొని తప్పనిసరిగా ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు ఎండి పోకుండా సమృద్ధిగా నీరు అందించాలన్నారు.

వేసవి కాలంలో దృష్టిలో ఉంచుకొని ప్రజలు రద్దీ ఉండే ప్రదేశాలలో మరిన్ని చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ కమిషనర్ జనగాం సంపత్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.