13 May, 2026 | 1:30 AM

ఆదర్శ డివిజన్‌గా ముత్తంగి

13-05-2026 12:00 AM

రూ.84 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్‌చెరు, మే 12 : ముత్తంగి డివిజన్ ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, సాయి ప్రియా కాలనీ, పార్థ కాలనీలలో 84 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యుజిడి నిర్మాణ పనులకు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కాలనీలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, ప్రభాకర్, కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, అమ్జాద్, ఆయా కాలనీల అధ్యక్షులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.